Open main menu

మున్నంగివారిపాలెం

మూస:Infobox India AP Village

మున్నంగివారిపాలెం, ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 169., యస్.టీ.డీ.కోడ్ 08594.

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

విశేషాలు

  • ఈ గ్రామం జాగర్లమూడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాసౌకర్యాలు బాగా లేవు. మార్టూరు లేక పర్చూరు నుండి ఆటోలో చేరుకోవాలి.ఈ కుగ్రామం జనాభా 250 మంది. చెరుకూరి నాగేశ్వరరావు గారు ప్రస్తుత గ్రామ సర్పంచిగా ఉన్నారు. ఈ కుగ్రామం, వ్యవసాయ రంగంతో పాటుగా విద్యా, వ్యాపార, ఉద్యోగ రంగాలలో అబిరుద్ది చెందినది అని చెప్పటంలో సందేహం లేదు. విదేశాలలో కూడా ఈ గ్రామ వాసులు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణిస్తున్నారు.
  • ఈ గ్రామం నుండి పలువురు ఆఫ్రికా ఖండంలోని ఉగాండాకు వ్యాపార నిమిత్తం తరలి వెళ్ళినారు. అందులో మాజీ సర్పంచి శ్రీ మున్నంగి బ్రహ్మారెడ్డి కుమారులు శ్రీ మున్నంగి సీతారామిరెడ్డి, మహేశ్వరరెడ్డి కూడా ఉన్నారు. దశాబ్దాల క్రితం వెళ్ళిన వీరిరువురూ, గ్రామాభివృద్ధికి ఆర్థిక సాయం అందించారు. గ్రామస్తుల దాహార్తి తీర్చేటందుకు మూడు సంవత్సరాల క్రితం, 25 లక్షల రూపాయలతో మంజూరయిన పైలట్ ప్రాజెక్టుకు, ప్రజల భాగస్వామ్యం క్రింద 4 లక్షల రూపాయలు, వారిద్దరూ సమకూర్చారు. రు. 5 లక్షలతో సిమెంటు రహదార్ల నిర్మాణానికి, ఒకటిన్నర లక్షల మ్యాచింగు గ్రాంటు., ఆలయంలో నేల చదును చేయడానికి మరో లక్షన్నర, గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా పరికరాలు, కంప్యూటరు కొనుగోలుకు ఒక లక్ష రూపాయలు, సమకూర్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వీరితోపాటు గ్రామానికి చెందిన మరో 15 మంది గ్రామస్థులు ఉగాండాలోనే ఉన్నారు. అమెరికాలో నలుగురు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలలో మరో 20 మంది గ్రామస్థులు స్థిరపడినారు. [1]

గ్రామ పంచాయతీ

  • ఈ గ్రామ పంచాయతీకి 2013, జూలై 23న జరిగిన ఎన్నికలలో శ్రీ చెరుకూరి పెద నాగేశ్వరరావు, ఒక్క ఓటు మెజారిటీతో, సర్పంచి పదవిని దక్కించుకున్నారు. [2]

మూలాలు

[1] ఈనాడు ప్రకాశం; జూలై-22,2013; 8వ పేజీ. [2] ఈనాడు ప్రకాశం మెయిన్; జూలై-24,2013; 10వ పేజీ.