ముస్లిం తీవ్రవాదం

From tewiki
Revision as of 22:50, 31 May 2017 by imported>ChaduvariAWB (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ 11, 2001 → 2001 సెప్టెంబర్ 11, 26 ఫిబ్రవరి 1993 → 1993 ఫిబ్ర using AWB)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
2001 సెప్టెంబరు 11.లో అమెరికాపై జరిగిన దాడి తర్వాత ఇస్లామిక్ తీవ్రవాద దాడులు జరిగిన దేశాలు.

ముస్లిములు చేసే తీవ్రవాదాన్ని ఇస్లామిక్ తీవ్రవాదం అంటారు. క్రైస్తవ తీవ్రవాదం, జీలాట్ తీవ్రవాదం లాంటిదే ఇది. దీనికి ముఖ్యకారణము పరమతస్తులతో ఇమడలేక కలిగే ఒక రకమైన విద్వేషము, అసహనము. కాలానుగుణముగా మారలేని ప్రవృత్తి మతసంబంధమైన బోధనలనుండి ఉత్పన్నమయింది. ఇతర మతస్తుల అకృత్యాలు, సామాజిక మరియు రాజకీయ వత్తిడి, ఇతర మతాల పట్ల సరైన అవగాహన లేకపోవడం, ఇస్లాం పట్ల ఇతర మతస్తులకు సరైన అవగాహన లేక పోవడం, ఇస్లాం పట్ల తీవ్ర వైముఖ్యములు ముఖ్య కారణాలు.

ముస్లిములు చేసిన తీవ్రవాద ఘటనలు

వేయి సంవత్సరాలకు పూర్వం క్రైస్తవ రాజ్యాలకు ముస్లింల రాజ్యాలకు మధ్యన జరిగిన రాజకీయ పోటీల కారణంగా ప్రారంభమైన క్రూసేడులు మరియు హషాషీన్లు ఆతరువాత జిహాద్ పేరిట సాగిన యుద్ధాల పర్యవసానాలు నేటి తీవ్రవాదాలకు మూలకారణాలు.

ముస్లిం తీవ్రవాద సంఘటనలు :

 1. 1993 ఫిబ్రవరి 26 – న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో బాంబు పేలుడు. 6 మృతి.
 2. 1993 మార్చి 13 – 1993 ముంబైలో పేలుళ్ళు. 250 మృతి, 700 గాయపడ్డారు.
 3. 1994 జూలై 28 – అర్జెంటినాలో AMIA భవనం మీద వాహనంతో ఆత్మహుతి దాడి. యూదులను లక్షంగా చేసుకున్న ఈ దాడిలో 85 మంది మృతి మరియు 300 మంది గాయపడ్డారు.
 4. 1994 డిసెంబరు 24 – ఎయిర్ ఫ్రాన్స్ 8969 విమానాన్ని హైజాక్ చేశారు.
 5. 1996 జూన్ 25 – ఖోబార్ టవర్స్ లో పేలుళ్ళు, 20 మృతి, 372 గాయపడ్డారు.
 6. 1997 నవంబరు 17 – లక్సర్ దాడి. ఈజిప్ట్‌లో 6 సాయుధ ఇస్లామిక్ తీవ్రవాదులు పర్యాటకులు మీద దాడి చేశారు. 65 విదేశీ పర్యటకులు మృతి.
 7. 1998 ఫిబ్రవరి 14 – తమిళనాడులోని కోయంబత్తూరులో పేలుళ్ళు. 12 కిలోమీటర్ల పరిధిలో 13 బాంబులు పేలాయి. 46 మృతి, 200 గాయపడ్డారు.
 8. 1998 ఆగస్టు 7 – 1998లో టాంజానియా మరియు కెన్యా దేశాలలోని అమెరికా రాయబార కార్యాలయాలలో బాంబు పేలుళ్ళు. 224 మృతి, 4000+ గాయపడ్డారు.
 9. 1999 సెప్టెంబరు 4 – రష్యాలో పలు నగరాలలో వరుస పేలుళ్ళు. 300 మృతి.
 10. 2000 అక్టోబరు 12 – అడెన్‌లోని యెమెని పోర్టులోని USS cole మీద దాడి.
 11. 2001 సెప్టెంబరు 11 – 19 ముస్లిమ్ తీవ్రవాదులు 4 విమానాలని హైజాక్ చేసి అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మరియు పెంటగాన్‌ల మీద కూల్చడంతో 3000 మృతి.
 12. 2001 డిసెంబరు 13 – భారత పార్లమెంటు మీద ఆత్మాహుతి దాడి. పాకిస్తాన్‌కి చెందిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధలైన జైషే మహమ్మద్ మరియు లష్కరే తోయిబా ఈ ఘటనకు బాధ్యులు. 7 మృతి, 12 గాయపడ్డారు.
 13. 2002 మార్చి 27 – నెటన్యా (ఇజ్రాయెల్) లోని హోటల్‌లో ఆత్మాహుతి దాడి. 30 మృతి, 133 గాయపడ్డారు.
 14. 2002 మార్చి 30 మరియు 2002 నవంబరు 24 - హిందువుల రఘునాధ ఆలయం మీద దాడి. 25 మృతి.
 15. 2002 మే 7 – అల్-అర్బా (అల్జీరియా) లో పేలుళ్ళు. 49 మృతి, 117 గాయపడ్డారు.
 16. 2002 సెప్టెంబరు 24 – అహ్మదాబాదులోని హిందూ ఆలయంలో మషీన్ గన్‌తో దాడి.31 మృతి, 86 గాయపడ్డారు.
 17. 2002 అక్టోబరు 12 – బాలి నైట్ క్లబ్ లో పేలుళ్ళు. 202 మృతి, 300 గాయపడ్డారు.
 18. 2003 మే 16 – కసబ్లాన్కా దడులు – సలాఫియా జిహాదియా కసబ్లాన్కాలో ఏకకాలంలో 4 దాడులు చేసింది. 33 మృతి.
 19. 2004 మార్చి 11 – మాడ్రిడ్ (స్పెయిన్) లో ట్పయిన్లలో వరుస పేలుళ్ళు. 191 మృతి, 1460 గాయపడ్డారు.
 20. 2004 సెప్టెంబరు 1 - బెస్లాన్ పాఠశాలలో పిల్లలను బందీలుగా పట్టుకున్న ఇస్లామిక్ తీవ్రవాదులు. 344 పౌరులు మృతి, వీరిలో 186 పిల్లలున్నారు

ఇవి కూడా చూడండి