"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మొదటి బుక్క రాయలు

From tewiki
Jump to navigation Jump to search
విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
అళియ రామ రాయలు 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

మొదటి హరిహర రాయలువారి సోదరుడు మొదటి బుక్క రాయలు. ఇతడు క్రీ. శ. 1356నందు విజయనగర సింహాసనమధిష్టించాడు. ఇతడు విజయనగర రాజ్య స్థాపనమున, తరువాత బహుమనీ సుల్తాను లతో జరిగిన యుద్ధములందు తన అన్నగారయిన మొదటి హరిహర రాయలునకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఇతని కుమారుడు కంప రాయలు అనేక హిందూ క్షేత్రములను మహమ్మదీయుల అధీనమునుండి స్వాధీనము చేదుకున్నాడు.

బహుమనీ సుల్తానులతో యుద్దాలు

మొదటి యుద్దములు

బహుమనీ సుల్తాను అయిన మహమ్మద్‌ షా I ఓరుగల్లును ముట్టడించి, ఓరుగల్లునకు సహాయముగా వచ్చిన విజయ నగర ప్రభువులను కూడా ఓడించి, ఆ తరువాత 1366న అపరాధరుసుము చెల్లించమని బుక్క రాయలకు తాకీదు పంపించాడు, దానితో బుక్క రాయలు కోపితుడై బహుమనీ రాజ్యమునందున్న ముద్గల్లు కోటను ఆక్రమించాడు. బహుమనీ సేనలు విజయనగర సైన్యమును ఎదుర్కొని, ఆదవాని, కౌతల ప్రాంతములందు జరిగిన యుద్ధములందు విజయనగర సైనికులను ఓడించినాయి. ఈ యుద్ధమున సాధారణ ప్రజానీకానికి అనేక కష్టాలు ప్రాప్తించినాయి. వేలకొలదీ ప్రజలు నిరాశ్రయలు అయినారు. వందల కొలది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు. చివరకు బుక్క రాయలు సుల్తానుతో సంధి చేసుకొనినాడు, సంధి షరతులను అనుసరించి, ఇరువురూ సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఖేధమూ కలిగించకూడదు.

రెండవ యుద్దములు

మొదటి యుద్ధము తరువాత 1375 వరకూ యధాస్థితి కొనసాగినది. కానీ 1375 వ సంవత్సరమున మహమ్మద్ షా దివంగతులయినారు. తరువాత అతని వారసుడు ముజాహిద్ షా సింహాసనము అధిరోహించాడు. ఈ సమయములో బుక్క రాయలు కృష్ణా నది, తుంగభద్రా నది ప్రాంతముల మధ్య నున్న ప్రదేశమును ఆక్రమించెను. అంతే తిరిగి మరో యుద్ధము ప్రారంభమయినది. ఈ యుద్ధమున విజయనగర సైనికులు ఓడిపొయినారు. బహుమనీ సైనికులు విజయ నగర సైనికులను తుంగభద్రా నది దాటువరకూ తరిమివేసినారు.

కవులు

మంత్రి

బుక్క రాయలకు మంత్రిగా అసాధారణ మేథా సంపత్తి కలవాడుగా పేరుగాంచిన మాధవులు, వీరి గురువుగారు విద్యారణ్యస్వామి.

విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము


ఇంతకు ముందు ఉన్నవారు:
మొదటి హరిహర రాయలు
విజయనగర సామ్రాజ్యము
1356 — 1377
తరువాత వచ్చినవారు:
రెండవ హరిహర రాయలు