యం.వి.రమణారెడ్డి

From tewiki
Revision as of 08:10, 7 June 2019 by imported>Chaduvari (వర్గం:కడప జిల్లా విప్లవ రచయుతల సంఘ సభ్యులు తొలగించబడింది; వర్గం:కడప జిల్లా విప్లవ రచయితల సంఘ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

యం.వి.రమణారెడ్డి కడప జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. రచయిత. మాజీ శాసన సభ్యుడు. ఇతడు గుంటూరు మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్. చదివాడు. గుంటూరులో చదివే రోజుల్లో కవిత అనే మాసపత్రికను కొంతమంది మిత్రులతో కలిసి నడిపాడు. ప్రభంజనం అనే రాజకీయ పక్షపత్రికను కొంతకాలం వెలువరించాడు. ఇతడు విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. ఇతని రచనలు ఉదయం, జ్యోతి, ఆంధ్రప్రభ, ఇండియాటుడే, ఈనాడు, సాక్షి, రచన, నవ్య, సీమ సాహితి తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

రచనలు

  1. తెలుగు సినిమా స్వర్ణయుగం (సమీక్షా వ్యాసాలు)
  2. చివరకు మిగిలింది? (అనువాదం, మూలం:గాన్ విత్ ది విండ్)
  3. ఆయుధం పట్టని యోధుడు (మార్టిన్ లూథర్ కింగ్ జీవిత చరిత్ర)
  4. పరిష్కారం (కథలసంపుటి)
  5. రెక్కలు చాచిన పంజరం (అనువాదం, మూలం: పాపియాన్)
  6. మహాభారత స్రవంతిలో తెలుగింటికొచ్చిన ద్రౌపది
  7. పురోగమనం (అనువాదం, మూలం: అవే విత్ ఆల్ పెస్ట్స్)
  8. రాయలసీమ కన్నీటిగాథ