యువరాజు

From tewiki
Revision as of 14:22, 2 June 2020 by imported>ChaduvariAWBNew (→‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

యువరాజు మహారాజు పెద్దకుమారుడు. రాజు తర్వాత సింహాసనం అధిరోహించి అధికారం చేబట్టే అర్హత కలిగిన వాడు. యువరాజులకు రాజకీయము, యుద్దకౌశలములు తెలిసి ఉండాలి. అన్ని విద్యలయందు శిక్షణ తీసుకొని యుండాలి. పూర్వము మహారాజులు వారి పుత్రుల యొక్క పరిజ్ఞానము పెంచుటకు దేశాటనమునకు పంపెడి వారు. వివిధ రాజ్య స్థితి గతులను తెలుసుకొనుటకు, తద్వారా మహారాజు ద్వారా పరిపాలన బాధ్యతలను స్వీకరించి జనరంజకంగా పరిపాలించు అవకాశం యువరాజులకు కలిగేది.