"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రావులకొల్లు సోమయ్య పంతులు

From tewiki
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
రావులకొల్లు సోమయ్య పండితులు
దస్త్రం:R.S.Pantulu.jpg
'R.S.పండితులు'
జన్మ నామంరావులకోల్లు సోమయ్య పంతులు
జననం (1942-12-20)డిసెంబరు
20, 1942
అలవాలపాడు(ప్రకాశం జిల్లా), ఆంధ్రప్రదేశ్
మరణం డిసెంబర్ 24 2014
తెనాలి
వెబ్‌సైటు http://rspanditulu.blogspot.com/

రావులకోల్లు సోమయ్య పండితులు ప్రముఖ సంగీత విద్వాంసులు, నాద విద్వాంసుడు, నాదోపాసకులు, నాదబ్రహ్మ.

జీవిత విషయాలు

శ్రీ రావులకోల్లు సోమయ్య పండితులు గారు సంగీత విద్వాంసులు, నాదోపాసకులు. రావులకోల్లు సోమయ్య గారు వారి బావగారు అయినటువంటి ఉప్పలపాటి బాలయ్య గారి దగ్గర సంగీతం అభ్యసించడం మొదలు పెట్టేరు. ఆ తరువాత “తమిళనాడు లో 5 సంవత్సరముల పాటు, నెల్లూరులో కోన్ని సంవత్సరముల పాటు సంగీతము అభ్యసించారు”. సోమయ్య పండితులు గారు తెనాలి లోని పాత శివ ఆలయములో 45సంవత్సరముల పైగా ఆస్థాన సంగీత విద్వాంసులు గా ఉండినారు మరియు 5000 పైగా ఖచ్చేరిలు చేసినారు. ఆనాటి తెనాలి MLA అయిన గోగినేని ఉమా గారు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పికర్(తెనాలి MLA) అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారి చేత అనేక ప్రశంసలు పోందినారు. ఆయన దగ్గర చాలమంది విద్యార్ధులు సంగీతముని అభ్యసించినారు, ఎంతో మంది కళాకారులని ప్రోత్సహించి ఆదరించినారు. పండితులు గారు "నాగస్వర" వాద్యంలో సుప్రసిద్ధులు.తెనాలికి చెందిన మార్టూరు వెంకటేశ్వర్లు పండితులు గారు, ప్రముఖ క్లారినెట్ విద్వాంసులు S.సాంబయ్య గారు, తాడివలస రామారావు గారు క్లార్‌నెట్ విద్వాంసులు పండితులు గారికి సమకాలికులు.

మరణం

రోజు మాదిరిగానే శివాలయములో సంగీత ఖచ్చేరి చెస్తున్న సోమయ్య పంతులు గారు ఖచ్చేరి చెస్తున్న సమయములో ఆనారోగ్యంపాలై 24-12-2014, (వారం:బుదవారం, మాసం:పుశ్యమాసం, పక్షం:శుక్లపక్షం, తిధి:తదియ, ఉత్తరాషాడ నక్షత్రం) నాడు పరమపదించారు.

బయటి లింకులు

http://rspanditulu.blospot.com/
https://te.m.wikipedia.org/wiki/నాద_బ్రాహ్మణులు
https://te.m.wikipedia.org/wiki/నాదస్వరం