వావిళ్ల నిఘంటువు

From tewiki
Revision as of 07:43, 25 April 2018 by imported>Arjunaraocbot (replacing dead dlilinks to archive.org links)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
వావిళ్ల నిఘంటువు
కృతికర్త: శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి మరియు బులుసు వేంకటేశ్వరులు మరియు విద్వాన్ వేదము లక్ష్మీనారాయణశాస్త్రి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నిఘంటువు
ప్రచురణ: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు, మద్రాసు
విడుదల: 1949, 1951, 1953
ప్రచురణ మాధ్యమం: ముద్రణ
పేజీలు: 2000 పైన

వావిళ్ల నిఘంటువు 1949 [1]లో ముద్రించబడిన తెలుగు - తెలుగు నిఘంటువు. దీని మొదటి సంపుటము నిర్మాణకర్తలు శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి మరియు బులుసు వేంకటేశ్వరులు. దీని రెండవ మరియు మూడవ సంపుటాలకు విద్వాన్ వేదము లక్ష్మీనారాయణశాస్త్రి అదనంగా నిఘంటు నిర్మాణంలో చేరారు.

దీన్ని నాలుగు భాగాలుగా వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు, మద్రాసు వారు 1949, 1951 మరియు 1953 సంవత్సరాలలో ప్రచురించారు.

భాగాలు

  • వావిళ్ల నిఘంటువు మొదటి సంపుటములో అ నుండి ఔ వరకు అక్షరముల వివరాలు చేర్చారు.[2]
  • వావిళ్ల నిఘంటువు రెండవ సంపుటములో క నుండి ఝ వరకు అక్షరముల వివరాలు చేర్చారు.[3] మొదటి సంపుటముపై ప్రముఖుల అభిప్రాయాలను చేర్చారు.
  • వావిళ్ల నిఘంటువు మూడవ సంపుటములో ట నుండి న వరకు అక్షరముల వివరాలు చేర్చారు.[4]

ప్రముఖుల అభిప్రాయాలు

  • వేలూరి శివరామశాస్త్రి : వావిళ్ల నిఘంటువు మొదటి భాగము లోగడనున్న నిఘంటువులను జీర్ణము చేసికొనుటతోపాటు కొత్త వెలుగులు విరజిమ్ముచున్నది. ఇందు దేశ్యములని భ్రమపడుట కవకాశముగల కొన్ని దొంగపదములు వైకృతములని తెలుపు వ్యుత్పత్తి ఉంది. అరవము, కన్నడము మొదలగు భాషలలోని పదముల సోదరత్వము ఇందు నిరూపితము. ఇది తెలుగున కత్యావశ్యకము. ఇందు శిష్టవ్యవహారికములో గల దేశ్యములకు అర్థములు ఉన్నాయి.

మూలాలు