"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాసిరెడ్డి నవీన్

From tewiki
Jump to navigation Jump to search
వాసిరెడ్డి నవీన్
200px
వాసిరెడ్డి నవీన్
జననంవాసిరెడ్డి నవీన్
1954 మే 23
కృష్ణా జిల్లా, వీరులపాడు
ఇతర పేర్లువాసిరెడ్డి నవీన్
వృత్తికెనరా బ్యాంకులో ఉద్యోగం
ప్రసిద్ధిసాహితీకారుడు
మతంహిందూ

వాసిరెడ్డి నవీన్ ప్రఖ్యాత సాహితీకారుడు. ఈయన 1954 మే 23కృష్ణా జిల్లా వీరులపాడులో జన్మించారు. ఎం.యస్సీ వరకు చదివి, రష్యన్ భాషలో డిప్లొమాను సాధించారు.1977 లో కెనరా భ్యాంకులో ఉద్యోగంలో చేరి 2011మార్చిలో ఐచ్ఛిక పదవీ విరమణ చేశారు. హేతువాద ఉద్యమ కార్యకర్తగా అబ్రహం టి.కోవూర్ తో కలసి రాష్ట్రమంతటా తిరిగిన నవీన్ గుడివాడ, విజయనగరం లలో ఫిలిం సొసైటీలను యేర్పాటు చేశాడు. 1979 నుండి జనసాహితీ సాంస్కృతిక సమాఖ్యలో కార్యకర్తగా, కార్యవర్గ సభ్యునిగా, కార్యదర్శిగా, ప్రజాసాహితీ సంపాదకునిగా, వివిధ హోదాలలో పనిచేసి 1991 లో సంస్థ నుండి వైదొలగారు. ప్రధానంగా కథా సాహిత్యం పై ఎంతో మక్కువ కలిగిన నవీన్ 1990 లో కథా సాహితిని యేర్పాటు చేసి పాపినేని శివశంకర్తో కలసి క్రమం తప్పకుండా ఉత్తమోత్తమమైన కథలతో "కథ" సంకలనాలను వెలువరిస్తున్నారు. అమెరికా నుండి వెలువడుతున్న "తెలుగునాడి" సంపాదకులుగా విదేశాంధ్రుల అభిమానాన్ని చూరగొన్న నవీన్ "తెలుగు వెలుగు" మాసపత్రిక సలహాదారుగా పనిచేసారు.. తానా ఆహ్వానంపై అమెరికాలోనూ, తెలుగు కళా సమితి ఆహ్వానంపై కువైట్ లోనూ నవీన్ పర్యటించి సాహిత్యోపన్యాసాలు చేశారు.ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాదెమి జనరల్ కౌన్సిల్ సభ్యులు. తెలంగాణా విముక్తి పోరాటకథలు, తెలుగుకథ 60-85 సంకలనాలకు సంపాదకునిగా వ్యవహరించిన నవీన్ ప్రముఖ పత్రికలలో పలు విమర్శనా వ్యాసాలు, సమీక్షలు, కథలు, కవితలూ కూడా రాసారు. సికింద్రాబాద్ స్థిర నివాసంగా యేర్పరచుకొని సాహిత్యమే జీవితంగా గడుపుతున్న సహృదయుడు ఆయన.

సంపాదకీయం

  1. కథాసాహితి[1]

మూలాలు

  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (26 November 2018). "సిక్కోలులో 'కథ 2017' ఆవిష్కరణ". Archived from the original on 17 మార్చి 2020. Retrieved 17 March 2020. Check date values in: |archivedate= (help)

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).