"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వికీపీడియా:పరిచయము

From tewiki
Revision as of 19:43, 21 February 2021 by Chaitanya (talk | contribs)
Jump to navigation Jump to search

ప్రతి వ్యాసం పై భాగంలో "మార్చు" టాబ్‌ ని చూశారా? వికీపీడియాలో, మీరు లాగిన్‌ అయి ఉన్నా, లేకున్నా, ఎప్పుడైనా పేజీలకు మార్పులు చేర్పులు చేయవచ్చు.

ఈ వికీపీడియా ఏమిటి?

వ్యాసాన్ని సరిదిద్దటానికి ఈ పేజీ పైభాగంలో ఉన్న మార్చు ను నొక్కండి

వికిపీడియా ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇది అనేక మంది రచయితల సమష్టి కృషితో తయారవుతూంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రచయితలు మరెవరో కాదు, పాఠకులే రచయితలు. మీరు కూడా రచయితలు కావచ్చు. ఈ సైటు ముఖ్య ఉద్దేశ్యం కూడా సభ్యులందరి కృషితో వ్యాసాలను అభివృద్ది చేయడమే! చాలామంది వ్యక్తులు ప్రతి రోజూ వందల కొద్దీ మార్పుచేర్పులు చేస్తూ, నిరంతరం మెరుగు పరుస్తున్నారు. ఈ దిద్దుబాట్లు అన్నీ పేజీ చరిత్ర, ఇటీవలి మార్పులు పేజీలలో నమోదు అవుతాయి. అప్రసంగాలు, దుశ్చర్యలు వెంటనే తొలగింపుకు గురౌతాయి, వాటిని సృష్టించిన వారు నిషేధించబడతారు.

నేనెలా తోడ్పడవచ్చు?

వ్యాసాలను సరిదిద్దే విషయమై అందరినీ చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను/రచయితలను ప్రోత్సహిస్తోంది. నిర్లక్ష్యంగా ఉండకండి! సరైన పద్ధతిలో రాయని వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, ఎక్కువ తప్పులు గానీ, హాస్యాస్పదమైనవి గాని, ఏవైనా మీకు కనిపిస్తే అలాంటి తప్పులు సరిదిద్దండి. వికీపీడియాలో మీరు చేసే దిద్దుబాట్ల వల్ల నష్టం వాటిల్లుతుందని భయపడవద్దు. ఎప్పుడైనా వాటిని సరిదిద్దడం లేదా మెరుగుపరచడం చేయవచ్చు. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరుస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే!

మీ సరదా తీరాక,

దిద్దుబాటు ఎలా చెయ్యాలో మరింత నేర్చుకోండి >>

దిద్దుబాట్లు చెయ్యడం చాలా సుళువైన పని:

  1. ఈ పేజీ పైభాగంలో ఉన్న సవరించు ను నొక్కండి. మీ మొదటి దిద్దుబాటును ఇక్కడికిక్కడే ఈ పేజీలో ప్రయోగించవచ్చు.
  2. సందేశాన్ని టైపు చెయ్యండి.
  3. మీరు రాసిన విషయాన్ని భద్రపరచడానికి పేజీ కింది భాగంలో ఉన్న పేజీ భద్రపరచు ను నొక్కండి. ... లేదా మీరు చేసిన మార్పులు చూడడానికి "తేడాలు చూపించు" ను నొక్కండి.

ప్రయోగశాల లో మీ ఇష్టానుసారం దిద్దుబాట్లతో ప్రయోగాలు చెయ్యొచ్చు.