"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వికీపీడియా:పాఠం (బయటి లింకులు)

From tewiki
Revision as of 12:38, 27 January 2021 by Nskjnv.indicwiki (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

సహాయం పేజీలు | స్వాగతం  ·   తెలుగులో రచనలు చెయ్యడం  ·   5 నిమిషాల్లో వికీ  ·   పాఠం  ·   గైడు  ·   పదకోశం  ·   సహాయం  ·   సహాయ కేంద్రం  ·   ప్రశ్నలు  ·   మొబైల్ ద్వారా ఎడిటింగ్ చేయటం వీడియో పాఠాలు


వికీపీడియాకు బయట ఉన్న సైట్లకు కూడా వికీపీడియా వ్యాసాల నుండి లింకులు ఇవ్వవచ్చు. అంతర్గత లింకులను ఎలా సృష్టిస్తామో వీటినీ అలాగే సృష్టించవచ్చు. మామూలుగా బయటి లింకులన్నిటినీ వ్యాసం చివర ఉండే బయటి లింకులు విభాగంలో పెట్టాలి. అంతర్గత లింకు పెట్టగలిగిన సందర్భాల్లో బయటి లింకును పెట్టకండి.

బయటి లింకు పెట్టినపుడు చిన్న వివరణ కూడా ఇస్తే బాగుంటుంది. ఈ వివరణ ఆ లింకు పేరుగా కనిపిస్తుంది. ఉదాహరణకు.. గూగుల్ సైటు. ఇలాంటి లింకును సృష్టించేందుకు, లింకును టైపు చేసి, ఒక స్పేసు తరువాత, పేరు రాయాలి. ఈ మొత్తాన్ని ఒక స్క్వేరు బ్రాకెట్ మధ్యన రాయాలి. పై లింకును ఇలా రాయాలి:

[http://www.google.com గూగుల్ సైటు]


బయటి లింకులు విభాగంలో పెట్టినపుడు, లింకులన్నీ బులెట్ జాబితాలుగా పెట్టాలి:

==బయటి లింకులు==
*[http://www.google.com గూగుల్ సైటు]

ఇతర విధాలు

మరో రెండు విధాలుగా బయటి లింకులను ఇవ్వవచ్చు.

వివరణ ఏమీ లేకుండా కేవలం లింకును స్క్వేరు బ్రాకెట్ల మధ్యన రాయడం:

[http://www.google.com]

ఇలా రాస్తే ఇలా కనబడుతుంది: [1]. వ్యాసంలోపల మూలాలను చూపేటపుడు ఇలా రాస్తారు. ఇదో ఫుట్ నోటు లాగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని అలానే వాడాలి. వేరే చోట్ల దీన్ని వాడకండి.

ఇక రెండో పద్ధతిలో లింకు చెయ్యదలచిన సైటు పూర్తి URL ను టైపు చెయ్యడం:

http://www.google.com

పై విధంగా టైపు చేస్తే వికీ దాన్ని లింకుగా భావించి అడ్రసును "http://" తో సహా యథాతథంగా చూపిస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ పద్ధతిని వాడకండి.

మీరు నేర్చుకున్న దానిపై /ప్రయోగశాల/ లో ప్రయోగాలు చెయ్యండి