"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

విజయ విలాసము

From tewiki
Revision as of 00:51, 3 June 2020 by imported>InternetArchiveBot (2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
విజయ విలాసము
కృతికర్త: చేమకూర వెంకటకవి
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ప్రబంధం
ప్రచురణ:
విడుదల: 17వ శతాబ్దం

విజయవిలాసం కావ్యాన్ని చేమకూర వెంకటకవి రచించారు. ఈయనను వెంకన్న, వెంకటయ్య అని వ్యవహరించేవారు.

కథ

విజయుడు అనగా అర్జనుడు. అతడి విజయగాధను తెలిపేది కనుక ఇది విజయవిలాసం అనబడినది. ఇందులో ముగ్గురు కావ్యనాయికలు, ఈ నాయకుడు అర్జునుడు కలరు. కావ్యనాయికలు, ఉలూచి, చిత్రాంగద, సుభద్ర లు.

రచన నేపథ్యం

క్రీ.శ.1630 కాలానికి చెందిన చేమకూర వెంకన్న స్వయంగా కవియైన రఘునాథ నాయకుని ఆస్థానంలోని ప్రముఖ కవి. దక్షిణాంధ్ర కాలానికి సంబంధించిన శృంగారభరితమైన ఇతివృత్తాన్ని చేమకూర వెంకన్న చమత్కారభరితమైన శైలితో మేళవిస్తూ విజయ విలాసము కావ్యాన్ని రచించారు.

ఇతివృత్తం

విజయ విలాసంలో కథ భారతంలోనిది. బ్రాహ్మణ గోసంరక్షణార్థం, విల్లంబుల కోసం అర్జునుడు ధర్మరాజు అంతఃపురం వైపు వెడతాడు. ఆ ఏడాది ద్రౌపదీదేవి ధర్మరాజు సన్నిధిని ఉంది. నియమం ప్రకారం అర్జునుడు అటు వెళ్లకూడదు. కానీ పరాకున వెళ్ళాడు. దానికి ప్రాయశ్చిత్తంగా భూప్రదక్షిణకు బయలుదేరాడు. తోడుగా విశారదుడనే నర్మసచివుడు కూడా వెళ్ళాడు. గంగానది యొక్క పరివాహక ప్రాంత పుణ్యక్షేత్ర సంధర్శనలో ఉలూచి అనే నాగకన్య అతడిని మోహించి తనవెంట నాగలోకానికి తీసుకెళ్ళడం వారిరివురకూ ఇలావంతుడు జన్మించడం, తదనంతరం పాండ్యరాజ్యం సంధర్శనలో మలయధ్వజ మహారాజు కూతురు అయిన చిత్రాంగధను వివాహమాడి బబ్రువాహనుని కని అతడిని మామగారికి దత్తతివ్వడం, తర్వాత ద్వారక సంధర్శనలో శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రనీ వివాహమాడడం ఇదీ కావ్యంలోని ఇతివృత్తం.

అంకితము

ఈ గ్రంథమును తంజావూరు రాజయిన రఘునాథరాజు నాకు అంకితము ఇవ్వబడింది.

విశేషములు

ఈ గ్రంథమునకు తాపీ ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస విలాసము అను వ్యాఖ్యానము బహుళ ప్రాముఖమైనది.

మూలాలు

బయటి లింకులు