శంషాబాద్ (పి)

From tewiki
(Redirected from శంషాబాద్)
Jump to navigation Jump to search
శంషాబాద్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం శంషాబాద్
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 45
 - స్త్రీల సంఖ్య 42
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

శంషాబాద్ (పి), తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న శంషాబాద్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

గణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా- మొత్తం 87,837 - పురుషులు 45,201 - స్త్రీలు 42,636.సముద్రమట్టనికి 581 మీ.ఎత్తు[3]

విద్యా సౌకర్యాలు

శ్రీ విద్యా హైస్కూల్, కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్, ఒయాసిస్ హైస్కూల్, శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజి, గవర్నమెంట్ జూనియర్ కాలేజి ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

రోడ్డు రవాణా సంస్థ బస్ సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; ఉమ్రానగర్, ప్రధాన స్టేషన్ హైదరాబాదు 18 కి.మ

అంతర్జాతీయ విమానాశ్రయం

నిద్రలో జోగుతున్నట్టుగా ఉండే శివారు ప్రాంతపు గ్రామం షాంస్ ఉల్ ఉమ్రా పేరు కాస్త శంషాబాద్ గా మారింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబడి ఇప్పుడు చాలా పాపులర్ పేరుగా మారింది.23 మార్చి 2008 న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైంది. దీని మొత్తం విస్తీర్ణం 5400 ఎకరాలు.

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-08.
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 26 March 2021.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-05-14. Retrieved 2016-07-09.

వెలుపలి లింకులు