"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సాగునీటి ప్రాజెక్టుల వర్గీకరణ

From tewiki
Jump to navigation Jump to search

సాగునీటిని అందించే ప్రాజెక్టు సామర్ధ్యాన్ని బట్టి వీటిని వర్గీకరించారు.


1.చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులు

5వేల ఎకరాలు లేదా 2వేల హెక్టార్ల ఆయుకట్టు భూమి కంటే తక్కువ భూమికి నీటి వనరులు అందించే ప్రాజెక్టులను చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులు అంటారు.

2.మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు

5వేల ఎకరాల నుంచి 25వేల ఎకరాల ఆయుకట్టు భూమికి నీటి సౌకర్యాన్ని అందించే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు అంటారు.

3.భారీ సాగునీటి ప్రాజెక్టులు

25వేల ఎకరాల ఆయుకట్టు భూమి కంటే ఎక్కువ భూమికి నీటి వనరులను అందించే ప్రాజెక్టులను భారీ సాగునీటి ప్రాజెక్టులు అంటారు.

చిన్న సాగునీటి వనరులు అంటే

చిన్న సాగునీటి వనరులు అంటే సరసులు, చెరువులు, కుంటలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు.

ఇవి కూడా చూడండి

ఆనకట్ట

బయటి లింకులు

మూలాలు

సాక్షి దినపత్రిక(భవిత) - మే 2012