"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సాతాని

From tewiki
Jump to navigation Jump to search
రామానుజాచార్యుల శిష్యులు చాత్తాద శ్రీ వైష్ణవులు. వీరిలో చాలా మంది పేర్లు స్వామి లెదా ఆచారి (ఆచార్య) అనే పదాన్ని కలిగి ఉంటాయి. వీరిని సాతాని, చాతాని, అయ్యవారు, శ్రీవైష్ణవులు, విఖసులు (విఖస ఋషి వంశస్థులు కనుక) అని కూడా అంటారు. వీరి ప్రధాన వృత్తి వైష్ణవాలయాలలో అర్చకత్వం. వీరు ముఖ్యంగా గుడి వ్యవహారాలకు సంబంధించి స్థాయి పనులు చేస్తుంటారు.ఎక్కువుగా పురోహితులుగా వ్యవహరిస్తారు.

కులం మూలాలు

ఈ కులం వారు బ్రాహ్మణులలోని వర్గం, రామానుజలను అనుసరిస్తారు..

మొదటి కథ

వీరు అలా ఎలా ముఖ్య చిహ్నాలను కోల్పోయారో అన్న విషయం మీద ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ కథ ప్రకారం రామానుజుల వారి శిష్యులలో ఒక విభేదం వచ్చింది. ఆ విభేదం కర్మ, జ్ఞానం విషయమై తలెత్తింది. ఒక వర్గం ప్రకారం కర్మఫలం అనేది పూర్తి అయితేనే మోక్షం దొరుకుతుంది అనీ. మరో వర్గం ఇందుకు విరుద్ధంగా జ్ఞానం మాత్రమే ఉంటే పరమగమ్యాన్ని చేరవచ్చనీ వాదించింది. ఈ సంశయాన్ని నివారించేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఆ ఉపాయం ప్రకారం తామ్రపర్ణి నదిలోకి ఇరు వర్గాల వారు ప్రవేశించాలి. నీటి నుండి బయటకి వచ్చాక వర్గ సభ్యుల పరిస్థితిని అనుసరించి ఎవరి మార్గం సరియయినదోనన్న విషయం తెలుస్తుంది. అలా దూకగా, ఒక వర్గం వారికి శిఖలు తెగి - నున్నటి గుందుతో జంధ్యం లేకుండా బయటకు వచ్చారు.

మరో కథ

మరో కథ ప్రకారం మార్కండేయ ముని శ్రీశైలం (తిరుమల) మీద యజ్ఞం చేయగా 1. ఆళ్వార్, 2. ఎంబెరుమానార్, 3. జీయర్, 4. త్రివాది అనే నలుగురు ఋషులు యజ్ఞఫలంగా ఉద్భవించారు. అలా వచ్చిన ఎంబెరుమానార్ (రామానుజాచార్యులు) ను (సాతాని) చాత్తాద శ్రీవైష్ణవ కులం వారు తమ ఆద్యుడుగా కొలుస్తారు.

మరో కథ

మహబూబ్‍నగర్ లో సాతానుల చాత్తాద శ్రీవైష్ణవం ప్రకారం వారు 300 యేళ్ళ క్రితం అక్కడికి వలస వచ్చి కేశవపట్ణంలో స్థిర పడ్డారు. చాత్తాద శ్రీవైష్ణవులు సంప్రదాయ వృత్తి: బ్రాహ్మణకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించి, సిగను, జంధ్యాన్ని వదిలేసి ఆత్మగౌరవపోరాటం చేసిన వీరిని సాతాని పంతులు,అయ్యగారు అని కూడా పిలుస్తారు. తెలుగురాష్టాలల్లో అన్ని జిల్లాల్లో ఉన్న వీరు అర్చకులు, ఉపాధ్యాయులు,పురోహితులు,హరిభక్తులు,ఆయుర్వేద,మూలికా వైద్యులుగా ఉండేవారు[1]

సాతానులు చాత్తాద శ్రీవైష్ణవులు 15వ శాతాబ్దికి చెందిన చైతన్య మహాప్రభువు అతని శిష్యుడు సనాతనుడి అనుయాయులుగా కూడా కొన్ని ప్రాంతాల్లో పరిగణించబడతారు. వీరు బెంగాల్ లో పుట్టిన పరమ వైష్ణవ విప్లవానికి సంబంధించినవారు.. [2]

శ్రీరామానుజాచార్యులనే ఆద్యులుగా స్వీకరించిన తెంగలై శాఖీయ శ్రీవైష్ణవులే - చాత్తాద శ్రీవైష్ణవులు. వీరు 11వ శతాబ్దానికి ముందే వున్నట్లు లిఖిత శాస్త్రాలలో పరిచయం. చాత్తాద శ్రీవైష్ణవులు కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ,ఆంధ్రప్రదేశ్, మహారాష్టల్రలో పాటు సర్వత్రా వ్యాపించి వున్నారు. ద్రవిడ దేశంనుండి ఆరువందల సంవత్సరాల క్రితం, ఆంధ్ర, తెలంగాణాలోని పలు ప్రాంతాలలో శ్రీ వైష్ణవ ధర్మం పాటిస్తూ పల్లెవాసుల్లో వైష్ణవ ధార్మిక చింతన కలిగించడానికి వచ్చి స్థిరపడినట్లు తెలుస్తోంది. పల్లెలలో వీరు అనాదిగా దేవాలయాలనే నమ్ముకుని జీవిస్తున్నారు. వీరు అప్పట్లో దాదాపు 15 లక్షలకు పైగా వున్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. ద్రవిడ దేశంలో ‘చాత్తాద వైష్ణవులు’ ఆస్తులు, సంపదలుండి ధర్మకర్తలుగా, ఆలయాల్లో సేవకులుగా, పురోహితులుగా వివిధ పనులుచేస్తూ -‘అయ్యన్’, ‘అయ్యంగార్’లుగా ప్రజలచే పిలువబడినారని, తెలుగు రాష్ట్రాలలో నైజాం కాలానికి పూర్వమే వీరు ‘అయ్య’, ‘అయ్యగారు’, పంతులుగా ఆదరించబడినారని తెలుస్తుంది. నాడు చాత్తాద శ్రీవైష్ణవులు - ‘వీధి బడిపంతులుగా పల్లెపిల్లలకు పాఠాలు చెబుతూ, గుడిలో పూజారులుగా, ఊరి పురోహితులుగా ఆయుర్వేద వైద్యులు(డాక్టర్స్)గా వుండి ఊరి మిరాశీ, ఇనాం భూములు కలిగి వుండేవారు. వైష్ణవత్వం స్వీకరించిన బ్రాహ్మణులలోని కొందరు శిఖ, ముడిని కూడ త్యజించి- గురుపరంపరను అనుసంధానం చేసుకొని ‘అష్టాక్షరీ’నే ఎంతో ప్రేమతో జపించేవారని తెలుస్తుంది.[3]

చాత్తాదులలో జీయర్‌లు, సాతానీలు, పరవస్తు దాసరులు, తిరుతోపులనేవారు వుండేవారు . వీరిలో పాండిత్యము, కవిత్వము, శాస్తజ్ఞ్రానం కలిగి మెప్పుపొందిన వారు అనేకులు. నేటికి గుట్టలపై వున్న నరసింహ, వెంకటేశ్వర, ఆంజనేయ,రామాలయాలలో పరంపరానుగతంగా అర్చకత్వంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయశాఖ ద్వారా నిర్వహించే పరీక్షలలో ‘చాత్తాద శ్రీవైష్ణవ ఆగమము’ ప్రత్యేకించబడుట విశేషము.

శ్రీవైష్ణవ బ్రాహ్మణులకు సాతాని బిసి.డి ఇచ్చుటకు గల నేపథ్యం

చాత్తాద శ్రీవైష్ణవులలో సంఖ్యాబలమధికముగా ఉన్నప్పటికీ ఆర్థిక అసమానతలవలన వెనుకబాటుతనము ఎక్కువగా వుంది. 19వ శతాబ్దములోనే వీరు కొందరి ప్రమేయంతో ‘నైజాం జమానా’లోనే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా వచ్చారు. అట్టి వీరిని ప్రోత్సహించదలచిన నాటి కొందరు పెద్దలు ప్రభుత్వ గెజిట్‌లో - ‘చాత్తాదశ్రీవైష్ణవ (సాతాని)’ బి.సి- ‘డి’ గ్రూపు- 28 నెం.లో చేర్చారు కాని దానివలన పెద్దగా ఎవరూ ఉద్యోగ లబ్ధిని పొందినది లేదు. పలుమార్లు బి.సి ‘ఏ’లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కాని దీనిపై ‘చాత్తాద శ్రీవైష్ణువులలోనే’ ఏకాభిప్రాయం లేదని తెలుస్తున్నది. వీరిలో పట్టణ ప్రాంతాలలో యాజ్ఞీకి, ఆచార్యత్వం సిద్ధించుకొన్నవారు వలదని, కొందరేమో కావాలని పరస్పర భిన్నంగా మాట్లాడుతున్నారు. ఏదిఏమైనా వీరి అభివృద్ధికోసం- వైదిక బ్రాహ్మణ ఫెడరేషన్‌కు వలే- ‘‘చాత్తాద శ్రీవైష్ణవ ఫెడరేషన్’కూడ నెలకొల్పి వారి వివాహ, ద్రావిడ విద్య, చాత్తాద శ్రీవైష్ణవ ఆగమశాస్త్ర అవగాహన, ఆర్థిక స్థిరతకోసం పల్లెలలో, పొలాలు, పట్నంలో ఇళ్ళస్థలాలు మొదలగు వాటిని సమకూర్చి వారి అభ్యున్నతికి తోడ్పడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నది. ‘సమాజంలో స్వాములుగా దర్శనమిస్తూ, ‘అయ్య’లుగా పిలువబడుతున్న చాత్తాద శ్రీవైష్ణవులను ఆదరించడం వల్ల పల్లెప్రగతి, జనచైతన్యం, మనోవికాసం తథ్యమన్నది మరువరాని సత్యం.[4]


విభాగాలు

రెండో విభజన

ఇలా కాక చాత్తాద శ్రీవైష్ణవలను నాలుగు విభాగాలుగా కూడా చూస్తారు. అవి : 1. ఏకాక్షరి, 2. చతురాక్షరి, 3. "అష్టాక్షరి" 4. కులశేఖర. ఏకాక్షరి చాత్తాద శ్రీవైష్ణవులు ఓం ను చరమ శ్లోకంగా భావిస్తారు. వీరి ప్రకారం ఓంకారాన్ని జపించడం ద్వారా ముక్తి పొందవచ్చు. చతురాక్షరీ చాత్తాద శ్రీవైష్ణవులు రా-మా-ను-జ అన్న నాలుగు పదాలతో మోక్షం పొందవచ్చు అని నమ్ముతారు. అష్టాక్షరుల ప్రకారం ఓం-న-మో-నా-రా-య-ణా-య అన్న అష్టాక్షరి జపం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. ఇక కులశేఖర చాత్తాద శ్రీవైష్ణవులు జంధ్యం ధరించి, వారు కులశేఖర ఆళ్వార్ వంశస్థులమని చెప్పుకుంటారు. సామాజికంగా, మతపరంగా చాత్తాద శ్రీవైష్ణవులు అన్ని విభగాల వారూ తెంగాలై వైష్ణవ బ్రాహ్మణులలా వ్యవహరిస్తారు.

చాత్తాద శ్రీవైష్ణవులు ఇతర వర్గాలతో వివాహం చేసుకోవాల్సి వచ్చినపుడు గోత్రం-ఇంటి పేరు రెండూ కలిపి వేరుగా ఉండేలా చూసుకుంటారు.

గోత్రం ఇంటి పేర్లు
గార్గ్య పరోస్తువారు (పరవస్తు వారు), రేవడివారు, తిరూణహరి
కౌండిన్య నిశ్తలాపురివారు, నామంవారు, శ్రీపురంవారు
అంగీరస తల్వివారు, నామాటివారు, పూరంవారు
కౌశిక వీజాపురంవారు, పండతంవారు
నమ్మా ళ్వార్ గుల్బర్గావారు, మట్కాపూర్ వారు
కూర్మ ఆళ్వార్ ధర్మపురివారు, ఈబాళివారు
శేఖర ఆళ్వార్ యదులాపూర్ వారు, అకునోరువారు
తొండవపల్లి (తొండరిప్పోడి) ఆళ్వార్ దేవదర్గవారు, పర్ణకంవారు
పేయాళ్వార్ వకటాభరణంవారు, కంఠైపాలాన్
యతేంద్రియ ఆమూరి,
వశిష్ఠ జ్వాల

పెళ్ళిళ్ళు

స్వగోత్ర వివాహం నిషిద్ధం . 1800 నాటికి రెండు గోత్రాలే మిగిలాయని, అవి ఆళ్వార్, ఎంబెరుమానార్ అని ఈ కులం వారి నమ్మిక. ఇక ఒక గోత్రం వారు మరో గోత్రంలో వివాహం చేసుకోడం పరిపాటి అయింది. స్వగోత్ర వివాహాలు నిషిద్ధం. మేనరికం చేసుకునే పద్ధతి ఉంది. అలానే ఇద్దరు అన్న తమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళను చేసుకునే విధి కూడా ఉంది. , బాల్య వివాహం - పిల్లలు పుట్టిన నాడే వివాహ నిర్ణయం చేసుకోవటం ఇదివరకు ప్రబలంగా ఉండేది. చాత్తాద శ్రీవైష్ణవుల పెళ్ళి తంతు శ్రీ వైష్ణవులకు వీరికి తేడా ఉండదు. కంకణబంధం అనేది పెళ్ళిలో ముఖ్య ఘట్టం. ఇందులో పెళ్ళి కూతురూ-పెళ్ళి కొడుకు ఒకళికొకరు కంకణధారణ చేసుకుంటారు. ఆపై తంతు అంతా స్థానిక ప్రభావంతో మారిపోతుంది.

వితంతు వివాహం

సాతాని వారిలో వితంతువులు మళ్ళీ పెళ్ళి చేసుకోవడం నిషిద్ధం. విడాకులను ఈ కులం వారు గుర్తించరు. ఒకటి కన్న ఎక్కువ పెళ్ళిళ్ళను అనుమతించినప్పటికీ, ఇది ఎక్కువగా కనిపించదు. వ్యభిచారానికి పాల్పడిన స్త్రీని లేదా పురుషుడిని కులం నుండి బహిష్కరిస్తారు.

మతం

చాత్తాద శ్రీవైష్ణవ (సాతాని) వారు వైష్ణవం, శాక్తేయ మతాలను పాటిస్తారు. శైవ మతం పాటించే చాత్తాద శ్రీవైష్ణవులు అస్సలు కనిపించరు. వైష్ణవ చాత్తాద శ్రీవైష్ణవుల వారు విష్ణువును, మహాలక్ష్మిని పూజిస్తారు. ఆధ్యాత్మిక ధోరణిలో పన్నిద్దరు ఆళ్వారులను రామానుజులను కొలుస్తారు. పన్నిద్దరు ఆళ్వారుల జన్మ నక్షత్రం (దీనినే తిరునక్షత్రం అంటారు) గురు పాదముద్రలను నిత్యం పూజిస్తారు. ప్రతి చాత్తాద శ్రీవైష్ణవుడు చక్రాంకితాలు చేయించుకుంటారు. యజ్నోపవితాన్ని (కొంతమంది) ధరించారు..


త్రిదండి గురువులు...

"త్రిదండి" అంటే

  • త్రిదండముని ధరించినవారు* అని అర్థం. వైష్ణవ సంప్రదాయంలో మూడు తత్వాకలకు ప్రతీకగా మూడు దండాలు యతీశ్వరులు ధరించి ఉంటారు. ఒక్కో దండం ఒక్కోక్క తత్వానికి గుర్తు. ఒకటి "జీవుడి"కి ఒకటి "ప్రకృతి" కి మరియూ ఒకటి "పరమాత్మ" కి. మనం చూసే ఈ ప్రపంచం అంతా ఈ మూడు తత్వాలతోనే నిండి ఉంటుంది అని వేదం తెలియజేస్తుంది. వేదార్థాన్ని వివరించే పురాణాలు,ఇతిహాసాలు, వాఙ్మయాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. తత్వాలు అన్నింటినీ మూడుగా విడదీయవచ్చు.అందులో మనం లెక్కకు అందనంత మంది జీవులు. రెండోది రకరకాల చిత్రవిచిత్ర రూపాలు మార్చుకొనే పంచభూతాత్మకంగా ఉండే ప్రకృతి. "ప్రకృతి అచేతనం. జ్ఞానం ఉండదు."అందుకే "అచిత్"అని అంటారు. "చేతనరహితమైనప్పటికీ చేతనమైన జీవ సంబంధంచే తన రూపాన్నిమార్చుకుంటుంది."కర్మ సంబంధంచేతసహజమైన జ్ఞానం కలిగి అణు స్వరూపుడైన జీవులు ఈ ప్రకృతిని శరీరాలుగా దాల్చి ఉంటారు." ఎనభైనాలుగు లక్షల రకాల జీవులు అని చెబుతారు. ఈ జీవులంతా ప్రకృతిలో సంచరిస్తూ కర్మ అనుభవాన్ని కష్టమైనదో లేక సుఖమైనదో ఎదో ఒకదాన్ని పొందుతూ ఉంటారు. *ప్రకృతిని జీవరాశిని ఈ రెండు తత్వాలని నిరంతరం బయట లోపల వ్యాపించి వాటిని నిలబెట్టి, వాటికి కావల్సిన శక్తిని ఇచ్చి నడిపిస్తూ ఉండే తత్వానికి పేరు పరమాత్మ.* ఈ పరమాత్మ అనే తత్వం మూడోది. ఈ మూడు తత్వాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, విడిచి ఉండటం అనేది లేనే లేదు. *పరమాత్మ జీవ ప్రకృతిలలో వ్యాపించి ఉంటాడు. జీవుడు ప్రకృతిలో నిరంతరం ఉంటాడు.* అంటే మరి ముక్తి ఉండదా!? అంటే అట్లాంటి సందేహం అవసరం లేదు. ప్రకృతి అనేక రకాలుగా అనేక గుణాలతో ఉంటుంది. *ప్రకృతికి సత్వమని, రజస్సు అని మరియూ తమస్సు అనే గుణాలు.* అయితే మనం చూసే ప్రకృతి ఈ మూడు గుణాలతో కలిసి ఉంటుంది. అందుకే *మిశ్ర తత్త్వం* అని పేరు. *"రజస్సు", "తమస్సు" ఏమాత్రం లేని కేవలం సత్వం మాత్రమే ఉండే శుద్ధ సత్వ ప్రకృతి "విరజ" కు ఆవల ఉండే ప్రకృతి*. ఇవి రెండు కాక *గుణములకు అతీతమైన "కాలం" అనేది ఒక ప్రకృతి*. *కాలం కూడా ప్రకృతిలో ఒక భాగమే*, అందుకే అది *సత్వ శూన్యం* అని పేరు. *ఇలా మూడు రకాలుగా ఉండే ప్రకృతి, ఎన్నో జీవుల్లు, వీటికి వెనకాతల ఉండి నడిపించే పరమాత్మ ఈ మూడుతత్వాలని విశ్వసించి మనకు మార్గం చూపే యతులు "త్రిదండాన్ని"ధరించాలని శాస్త్రం యొక్క నిర్ణయం*. ఈ మూడు దండాలను ధరించిన వ్యక్తిని *త్రిదండి* అని అంటారు. చక్రం ధరించిన వాడిని చక్రీ అన్నట్టుగానే 'త్రిదండీ' అని సంస్కృతంలో పదం వస్తుంది, అదే తెలుగులో 'త్రిదండి' అని వ్యవహరిస్తాం. *శ్రీవైష్ణవ సంప్రదాయంలోయతులు తిదండాన్ని ధరించాలని నియమం*. వేదం కానీ, ఇతిహాసాలు కానీ ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. *దత్తాత్రేయుడు అనే భగవంతుడువేదోద్ధరణకై ఎత్తిన అవతారం*. *"మేలుకోట"* ప్రాంతంలో ఆయన *పాద చిహ్నాలు* ఉంటాయి. అక్కడి పుష్కరిణికి *దత్తాత్రేయ పుష్కరిణి* అని పేరు. భగవంతుడు *అత్రి మహర్షి* కి *అనసూయ* కు *తనను తానే వారి పుత్రునిగా అర్పించుకోవడం చేత "దత్తుడు" అయ్యాడు*. అందుకే ఆయన పేరు దత్తాత్రేయుడుఅయ్యింది. వైదిక ధర్మాన్ని లోకానికి నెలకొల్పి ఉన్నాడు, ఆయనకూడా త్రిదండి సన్యాసి అని తెలుస్తుంది. ఈనాడు దత్తాత్రేయుడు అని మూడు తలలతో ఆయన చుట్టు కుక్కలు ఉన్నట్లు చూపించే దత్తాత్రేయుడు వేరే, ఈయన ఎప్పుడు వచ్చాడో మనకు తెలియదు. *మనకు ప్రామాణికమైనగ్రంథాలు తెలిపే దత్తాత్రేయుడు*
  • "త్రిదండి సన్యాసి" అని తెలుస్తుంది*. అందుకే అవసరం ఏర్పడినప్పుడు *త్రిదండి సన్యాసులు "మేలుకోట"లో "దత్తాత్రేయు"ని వద్దకి వెళ్ళి "త్రిదండాన్ని" పొందే సంప్రదాయం ఉంది*. *రామానుజుల* వారి చరిత్రలో వారికి చోళ రాజు వల్ల ఏర్పడ్డ ఉపద్రవం తొలగించడాని *కూరేశులు* రామానుజులవారి దండాన్ని, కాషాయాన్ని ధరించి రామానుజుల వారిని పశ్చిమ దేశం వైపు పంపారు. రామానుజుల వారు *మేలుకోట* ప్రాంతం చేరే సరికి వారి వద్ద త్రిదండం, కాషాయం లేదు. తిరిగి వాటిని పొందే అవకాశం లేదు. అందుకే వారు *"మేలుకోట"లోని "దత్తాత్రేయుడి" వద్ద కొత్త "త్రిదండాన్ని", కాషాయాన్ని ఉంచి స్వీకరించినట్లు చరిత్ర* చెబుతుంది. *వైదికంగా లభించే సన్యాస క్రమం*
  • త్రిదండి క్రమం*. *మన "పెద్ద జీయర్ స్వామి" వారు అట్లా ప్రామాణికమైన పరంపరలోనే సాగాలి అని వారు "త్రిదండి" సన్యాసాన్నే స్వీకరించారు*. *#మన ఆంధ్ర దేశానికి ప్రామాణికమైనసంప్రదాయాన్ని అందించి మనం ఒకరం ఉన్నాం అనేట్టు చేసిన మహనీయులు మన పెద్ద జీయర్ స్వామి వారు.#*
  • "త్రిదండి నారాయణార్య గురు చందిరం ఆశ్రయామి"* అని మన పెద్ద జీయర్ స్వామి వారిని స్తుతిస్తాం. *"నారాయణార్యులు" అనే ఆచార్యులు చంద్రునితో సమానం, అట్లాంటి ఆచార్యుడిని ఆశ్రయిస్తున్నాను అని అర్థం* వస్తుంది. *#ఆచార్యులని మనం చంద్రునితోపోలుస్తుంటాం, ఎందుకంటే చంద్రుడు మనకు ఎప్పుడూ తెల్లటి చల్లటి వెన్నెలను ప్రసాదిస్తాడు. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే కాంతిని అందించి లోకాన్ని ఆనందింపజేస్తాడు. ఆ చల్లని మంచు వల్ల సమస్త ప్రాణికోటికి అవసరమైనఔషధులని పండిస్తాడు. అంటే ఆయన పోషకుడు మరియూమనోరంజకుడు. అట్లానేఆచార్యుడు ఆత్మను పోషించే భాద్యత స్వీకరిస్తాడు. జ్ఞానోపదేశం చేస్తూ మనలో భక్తిని పండేట్టు చేస్తాడు. మనకు శాస్త్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలోతెలియదు. శాస్త్రంలోని ఎన్నో విషయాల ముందు వెనకలు అన్వయం చేసుకోవడం ఎట్లానో తెలియదు,గురుకులంలో చేరి ఎంతో కష్టపడి నేర్చుకుంటే తప్ప తెలియవు. అదే ఆచార్యులు తామే రహస్యాలని గ్రహించి మనం అర్థం చేసుకొనే సులభమైన రీతిలో ఉపదేశం చేస్తారు. అట్లా ఆచార్యులు పోషకులు అవుతారు. అంతే కాదు చంద్రుడు సూర్యుని కిరణాలను తన చల్లని కాంతిగా మార్చి ఇచ్చినట్లే, ఆచార్యుడు భగవత్ విషయాలను మనకు అర్థం అయ్యేట్లు మన వరకుఅందిస్తాడు. భగవంతుడు చెప్పిన భగవద్గీతాది గ్రంథాలు ఉపదేశం చేసిన మనకు ఎందుకో అంతనచ్చవు. అంతే కాదు భగవంతుడు నిగ్రహానికి అనుగ్రహానికి తేడా చూపడు. తప్పుని దండిస్తానంటాడు, మంచికి ప్రేమ చూపిస్తాడు, రెండూ సమానం ఆయనకి. అందులో మన మీద అనుగ్రహం కంటే నిగ్రహమే ఎక్కువ. అందుకే నేరుగా భగవంతుడిని ఆశ్రయిస్తే సిద్ది కలుగుతుందో, కలగదో సందేహమే !! "సిద్దిర్భవతివాన్ నేతి సంశయః అచ్యుత సేవినాం" అని చెబుతారు గ్రంథాల్లో. భగవంతుడిని ఆశ్రయించిన వాడిని అనుగ్రహం తప్పక లభిస్తుందో లేదో అనేది సంశయం మాత్రమే, అదే "నసంశయోస్తి తద్భక్తపరిచర్యారతాత్మనాం" భగవత్ భక్తులైన ఆచార్య ఆశ్రయణ చేసిన వారికి సిద్ది లభించునా లేదా అనే సంశయం అవసరం లేదు. తప్పక లభించి తీరుతుంది.భగవంతుని వద్దకి మనం నేరుగా వెళ్ళలేం కదా, అట్లా వెళ్ళ గలిగే వారితో చేరితే తప్పక చేరుకోవచ్చు...


సంతోష్ కుమార్ ఆమూరి యాదగిరిగుట్ట.. 9866244610..

మరణించిన వారి పార్థివ శరీరాన్ని విసృజించే విధానం

సాధారణంగా మరణించిన వారిని దహనం చేస్తారు. చక్రాంకితం కాని పిల్లలనూ, సన్యాసం స్వీకరించిన వారిని ఖననం చేస్తారు. పిల్లలు అయితే పడుకో బెట్టి, కాళ్ళు ఉత్తర దిక్కుకు ఉండేలా ఖననం చెస్తారు. సన్యాసులు, వృద్ధులను ఖననం చేసే పక్షంలో వారిని తూర్పుకు అభిముఖంగా కూర్చోబెట్టి ఖననం చేస్తారు. అస్థీకలను నదిలో కలపడం లేదా ఖననం చేసి సమాధి కట్టడం చేస్తారు. మరణించిన పార్థివ శరీరాన్ని ముందుగా స్నానం చేయించి, నుదుటన తిరునామం దిద్దుతారు. పది రోజుల పాటు శోకంలో బంధువులు ఉంటారు. 10వ రోజున అతి సమీప బంధువు శిరోముండనం తో శోకం-శౌచం ముగుస్తాయి. 11వ రోజు పుణ్యహవాచనం ఉంటుంది. 12వ రోజు రాత్రికి నాలాయిర దివ్యప్రబంధం మొదటి రెండు అధ్యాయాల అభ్యాసం ఉంతుంది. మిగితా 8 అధ్యాయాలు 13వ రోజున చదువుతారు. అదే రోజు శ్రీవైష్ణవ బ్రాహ్మణులతో కలిసి స్మశానానికి వెళ్ళి సమాధి వద్ద పూజలు చేస్తారు. తిరిగి వచ్చి విందు చేయటం ద్వారా తంతు ముగుస్తుంది. ప్రతి నెల సంవత్సరం వరకూ మాసికాలు చేస్తారు. శ్రాద్ధ కర్మ ప్రతి సంవత్సరం చేస్తారు.

పూర్వరంగం

అప్పట్లో గ్రామ చావిడిలో పాఠాలు చెప్పేవారు. చెట్టు కింద పాఠశాలలను వీరు ప్రారంభించినవే. అప్పట్లో వీరికి నెల జీతాలో, టరమ్‌ ఫీజులో ఉండేవి కావు. గ్రామస్తులు ఏడాదికొకసారి పంటలు చేతికొచ్చాక ధాన్యం రూపేణా ఎంతో కొంత సమర్పించుకునేవారు. వాటితోనే ఏడాది మొత్తం గడపాల్సి వచ్చేది. పౌరోహిత్యంతోపాటు ఆయుర్వేదం, వనమూలికా వైద్యం వీరు నిర్వర్తిస్తుండేవారు.

జీవని

కర్నూలు, అనంతపురం జిల్లాలలో అర్చ కులుగా ఎక్కువ మంది జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ వీరు సిగ పెంచక పోయినా, జంధ్యం మాత్రం ధరిస్తారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని వారు అర్చకత్వం తోపాటు శ్రాద్ధ ఖర్మలు కూడా నిర్వర్తిస్తారు. నిజామా బాద్‌, వరంగల్‌ జిల్లాల్లో అద్దకం పని వేసి జీవిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అటవీప్రాంతంలో అడ్డాకులు సేకరించి విస్తళ్లు కుడుతున్నారు. కృష్ణా, గుంటూరు వంటి కొన్ని జిల్లాల్లో ఆయుర్వేద వైద్యులుగా, హరిదాసులుగా జీవనం సాగిస్తున్నారు. వైష్టవాలయాల్లో అర్చకులుగా సేవలందిస్తున్నారు. ధూప, దీప, నైవేద్యాల పేరుతో 2,500 రూపాయలు గ్రామ పంచాయితీల దయాదాక్షిణ్యాలపైన అందుతున్నాయి. వీరికి కనీసం మూడు వేల రూపాయలు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ఫలితం లేక పోయింది. రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తున్న ఇతర దేవాలయాల అర్చకులకు ఆరు నుంచి పది వేల రూపాయల జీతం అందు తుండడంతో, తమకు కనీసం 3500 రూపాయల వేతనం ఇవ్వాలని వీరు కోరుతున్నారు. ఇదిలావుండగా వారసత్వంగా భూమి వస్తుందన్న మాటేకానీ, పట్టాలేని కారణంగా ఆయా గ్రామపెత్తందారులపై ఆధారపడాల్సి వస్తోంది. మరికొన్ని గ్రామాల్లో తరతరాలుగా వస్తున్న భూములు అన్యాక్రాం తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి రాయలసీమ జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తోంది.

గతంలో స్వామి అని పేరు చివర పెట్టుకునేవారు కనుక వీరి సామాజిక వర్గీయులు ఏకం కావడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు స్వామి అనే పదం అందరూ పెట్టుకోవడంతో అటువంటి ఐక్యత కరువైంది. వీరిలో ఉపాధ్యాయులు, అర్చకులు ఎక్కువ మంది ఉండడంతో అక్షరాస్యత దాదాపు 70 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కులం సర్టిఫికెట్‌ కోసం పరుగులు తీసేవారి సంఖ్య కూడా వీరిలో తక్కువే. బాగా చదువుకున్నవారు కుల సర్టిఫికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. సాఫ్ట్వేర్‌, గ్లోబల్‌ విలేజ్‌ అంటూ తమకు కుల సర్టిఫికెట్‌ వలన ప్రయోజనమేముందని ప్రశ్నిస్తున్నారు. వీలైనచోట్ల బ్రాహ్మణుల్లో కలిసిపోతున్నారు. చాత్తాద శ్రీ వైష్ణవులు తరతరాలుగా దేవాలయాల్లో పనిచేస్తున్నారు కనుక దేవాలయ ట్రస్టీగా ఈ కులస్తులకు పదవులు ఇవ్వాలని అర్హులైనవారిని పూజారు లుగా నియమించాలని, తమను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలని కోరుతున్నారు. రాష్ర్టంలోని చాత్తాద శ్రీ వైష్ణవుల జనాభా 7 లక్షలు. నలుగురు ఎంపిటిసీలు, ముగ్గురు సర్పంచ్‌లు ఉన్నారు.

తెలంగాణలోని హైద్రాబాద్, వరంగల్, కరింనగర్ జిల్లాలలో వీళ్ళు అధికంగా వున్నారు.[5]

మూలాలు