"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సాహిర్ లుధియానవి

From tewiki
Revision as of 19:31, 10 February 2021 by imported>K.Venkataramana.AWB (→‎అవార్డులు: clean up, replaced: పద్మశ్రీపద్మశ్రీ)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
సాహిర్ లుధియానవి
పుట్టిన తేదీ, స్థలంఅబ్దుల్ హాయీ
(1921-03-08)8 మార్చి 1921
లూధియానా, పంజాబ్, భారతదేశం
మరణం25 అక్టోబరు 1980(1980-10-25) (వయస్సు 59)
బొంబాయి (ప్రస్తుతం ముంబై)
వృత్తిరచయిత, lyricist

సాహిర్ లుధియానవి (ఆంగ్లం : Sahir Ludhianvi) (ఉర్దూ : ساحر لدھیانوی ) (జననం : మార్చి 8, 1921 – మరణం : అక్టోబరు 25, 1980), సుప్రసిద్ధ ఉర్దూ కవి, బాలీవుడ్ గేయరచయిత. ఇతడి పేరు "అబ్దుల్ హయీ", కలంపేరు "సాహిర్", లూధియానాకు చెందినవాడు కాబట్టి లుధియానవి అయ్యాడు. సాహిర్ అనగా 'మాంత్రికుడు' (జాదూ చేసేవాడు), సాహితీ ప్రపంచంలో ఇలాంటి కలంపేర్లు పెట్టుకోవడం ఓ ఆనవాయితీ. రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.

బాలీవుడ్ లో తన ప్రస్థానం మొదలెట్టి, అంచెలంచెలుగా ఎదిగి, ఓ రెండు దశాబ్దాలుగా వెలుగొందాడు. హిట్టయిన ప్రతిచిత్రం ఇతడి పాటలు కలిగివుండేది.

అక్టోబరు 25, 1980, 59 సం.ల వయస్సులో గుండెపోటుతో మరణించాడు.

కవితలు

 • కభీ కభీ చిత్రంలోని పాట;
"మైఁ పల్ దో పల్ కా షాయర్ హూఁ, పల్ దో పల్ మెరీ కహానీ హై
"मै पल दो पल का शायर हुँ, पल दो पल मेरी कहानी है
పల్ దో పల్ మేరీ హస్తీ హై, పల్ దో పల్ మెరీ జవానీ హై
पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है
ముఝ్‌సె పహ్‌లే కిత్నే షాయర్ ఆయే ఔర్ ఆకర్ చలే గయే,
मुझसे पहले कितने शायर आए और आकर चले गए,
కుఛ్ ఆహేఁ భర్‌కర్ లౌట్ గయే, కుఛ్ నగ్‌మే గా కర్ చలే గయే
कुछ आहे भरकर लौट गए , कुछ नग्मे गाकर चले गए
వో భీ ఎక్ పల్ కా కిస్సా థే, మైఁ భీ ఎక్ పల్ కా కిస్సా హూఁ
वो भी एक पल का किस्सा थे , मै भी एक पल का किस्सा हुँ
కల్ తుమ్ సె జుదా హో జావూఁగా, జో ఆజ్ తుమ్‌హారా హిస్సా హూఁ
कल तुमसे जुदा हो जाउंगा , जो आज तुम्हारा हिस्सा हुँ"
 • ప్యాసా చిత్రంలోని ఈ పాట అప్పటి ప్రధానమంత్రియైన జవహర్లాల్ నెహ్రూను సైతం కదిలించివేసింది.
"యే కూచే, యె నీలామ్ ఘర్ దిల్‌కషీ కే,
యె లుట్‌తే హువే కారవాఁ జిందగీ కే,
కహాఁ హైఁ, కహాఁ హైఁ ముహాఫిజ్ ఖుదీ కే,
జిన్‌హే నాజ్ హై హింద్ పర్ వో కహాఁ హైఁ,"

పాటలు

సాహిర్ వ్రాసిన కొన్ని పాటలు;

 • ఆనా హై తొ ఆ (आना है तो आ) - నయా దౌర్ (1957) - స్వరకల్పన ఓ.పి.నయ్యర్.
 • యె దునియా అగర్ మిల్ భి జాయే తొ క్యా హై (ये दुनिया अगर मिल भी जाए तो क्या है) (ప్యాసా -1957), స్వరకల్పన ఎస్.డి.బర్మన్.
 • తూ హిందు బనేగా న ముసల్మాన్ బనేగా, ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా (तु हिंदु बनेगा ना मुसलमान बनेगा) - ధూల్ కా ఫూల్ (1959), స్వరకల్పన దత్తా నాయక్.
 • యే ఇష్క్ ఇష్క్ హై (ये ईश्क ईश्क है ) - బర్సాత్ కి రాత్ (1960), స్వరకల్పన రోషన్.
 • నాతో కారవాఁకీ తలాష్ హై (ना तो कारवाँ की तलाश है) - బర్సాత్ కీ రాత్ (1960), స్వరకల్పన రోషన్.[1]
 • అల్లా తేరో నామ్, ఈశ్వర్ తేరో నామ్ (अल्ला तेरो नाम ईश्वर तेरो नाम) - హమ్ దోనో (1961), స్వరకల్పన జయదేవ్.
 • చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్‌నబీ బన్ జాయేఁ హమ్ దోనో (चलो ईक बार फिर से अजनबी बन जाए हम दोनो ) - గుమ్‌రాహ్ (1963 ) - స్వరకల్పన రవి.
 • మన్ రే తూ కాహే న ధీర్ ధరే (मन रे तु काहे ना धीर धरे?) - చిత్రలేఖ (1964) - స్వరకల్పన రోషన్.
 • సంసార్ సే భాగే ఫిర్తే హో, భగవాన్ కో తుమ్ క్యా పావో గే (संसारसे भागे फिरते हो, भगवान को तुम क्या पाओगे) - చిత్రలేఖ (1964) - స్వరకల్పన రోషన్.
 • ఈశ్వర్ అల్లా తేరే నామ్ (ईश्वर अल्ला तेरे नाम) - నయా రాస్తా (1970) - స్వరకల్పన దత్తానాయక్.
 • మైఁ పల్ దో పల్ కా షాయర్ హూఁ (मै पल दो पल का शायर हुँ) - కభీ కభీ (1976) - ముహమ్మద్ జహూర్ ఖయ్యాం.
 • కభీ కభీ (कभी कभी) - కభీ కభీ (1976) - ముహమ్మద్ జహూర్ ఖయ్యాం.

రచనలు

 • తల్‌ఖియాఁ
 • గాతా రహే బంజారా

అవార్డులు

 • 1964: ఫిలింపేర్ - ఉత్తమ గేయరచన - "జో వాదా కియా వో నిభానా పడేగా" (తాజ్‌మహల్-సినిమా)
 • 1977: ఫిలింఫేర్ - ఉత్తమ గేయరచన - "కభీ కభీ మెరె దిల్ మేఁ ఖయాల్ ఆతాహై" - కభీ కభీ సినిమా [2]
 • 1971 : పద్మశ్రీ పురస్కారం - సాహిత్యం, విద్యారంగం.[3]

ఇవీ చూడండి

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం

మూలాలు

 1. "20 Best Lyrics of Sahir". Archived from the original on 2009-02-04. Retrieved 2009-06-15.
 2. Awards imdb.com.
 3. http://india.gov.in/myindia/advsearch_awards.php

బయటి లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).