Open main menu

సి.హెచ్. మల్లారెడ్డి

Revision as of 00:50, 25 July 2019 by imported>Pranayraj1985 (మూలం చేర్చాను)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

సి.హెచ్. మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు మరియు 16వ పార్లమెంటు సభ్యులు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తరపున గెలుపొందారు. అనంతరం టీ.ఆర్.ఎస్.లో చేరారు.[1]

సి.హెచ్. మల్లారెడ్డి
సి.హెచ్. మల్లారెడ్డి


ఎం.పి.
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
మే 16, 2014
ముందు సర్వే సత్యనారాయణ
నియోజకవర్గం మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1953-09-09) 1953 సెప్టెంబరు 9 (వయస్సు 67)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి కల్పన రెడ్డి
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కూతురు
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

న్యూఢిల్లీ, భారతదేశం

వృత్తి రాజకీయ నాయకులు
విద్యావేత్త
సామాజిక వేత్త
మతం హిందూ

జననం

మల్లారెడ్డి 1953, సెప్టెంబర్ 9తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్లో జన్మించారు.[2]

రాజకీయ ప్రస్థానం

2014, మార్చి 19న తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014, ఏప్రిల్ 9న మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం ఎం.పి. అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ పార్టీ టికెట్ ఇచ్చింది. 2014, మే 16న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.[3] తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డే. 2016 జూన్ లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.[1]

2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల, మహిళ, శిశు సంక్షేమ, నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్నారు.[4][5][6]

మూలాలు

  1. 1.0 1.1 ఇండియన్ ఎక్స్ ప్రెస్. "TDP's lone Telangana MP, Malla Reddy, joins TRS". Retrieved 14 February 2017.
  2. "Ch. Malla Reddy". india.gov.in. Retrieved 12 February 2017.
  3. వెబ్ ఆర్కైవ్. "ELECTION COMMISSION OF INDIA". web.archive.org. Retrieved 14 February 2017.
  4. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  5. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  6. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.