"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

27 డౌన్

From tewiki
Revision as of 19:08, 19 August 2017 by imported>స్వరలాసిక
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
27 డౌన్
దస్త్రం:27down.jpg
దర్శకత్వంఅవతార్ కృష్ణ కౌల్
నిర్మాతఅవతార్ కృష్ణ కౌల్
స్క్రీన్ ప్లేఅవతార్ కృష్ణ కౌల్
ఆధారంఅఠారా సూరజ్ కే ఫౌదే 
by రమేష్ బక్సీ
నటులురాఖీ
ఎం.కె.రైనా
సంగీతంహరిప్రసాద్ చౌరాసియా
భువనేశ్వర్ మిశ్రీ
ఛాయాగ్రహణంఅపూర్బ కిశోర్ వీర్
కూర్పురవి పట్నాయక్
విడుదల
1974 (1974)
నిడివి
118 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

27 డౌన్ 1973లో విడుదలైన హిందీ సినిమా. ఈ సినిమా ఉత్తమ హిందీ సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందింది. రమేష్ బక్సీ వ్రాసిన "అఠారా సూరజ్ కే ఫౌదే" అనే హిందీ నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.

నటీనటులు

  • రాఖీ
  • ఎం.కె.రైనా
  • ఓంశివపురి
  • రేఖా షబ్నవీస్

సాంకేతికవర్గం

  • కథ: రమేష్ బక్సీ
  • దర్శకత్వం: అవతార్ కృష్ణ కౌల్
  • నిర్మాత:అవతార్ కృష్ణ కౌల్
  • ఛాయాగ్రహణం: అపూర్బా కిశోర్ వీర్

కథ

సంజయ్ షిండేకు ఆ రైలు ప్రయాణం చాలా చికాగ్గా వుంది. ప్రశాంతతను అన్వేషిస్తూ బయలుదేరిన అతనికి ఆ మూడవ తరగతి కంపార్టుమెంటులోని జన సమ్మర్ధం ఆ అరుపులు అతని మనసులోని వ్యధను మరింత అధికం చేశాయి. కళ్ళు మూసుకున్నాడు. అతనికి గతం మళ్ళా ప్రత్యక్షమైంది.

రైలు ప్రయాణానికీ సంజయ్‌కూ మొదటి నుంచీ ఒక అవినాభావ సంబంధం వుంది. అసలు అతను పుట్టడమే రైల్లో పుట్టాడు. రైల్వేటౌన్ అనబడే భుసావల్‌లో ఇంజన్ డ్రైవరుగా పనిచేస్తున్న తండ్రి అదుపాజ్ఞల్లో పెరిగాడు. పట్టాల మీద నడిచే రైలులా ఎప్పుడూ తండ్రి చెప్పే మార్గాన్నే అనుసరించడానికి అలవాటు పడిపోయాడు. రైలు ప్రమాదంలో తండ్రి అవిటివాడయ్యే సరికి అంత వరకు రైలు మీద సంజయ్‌కు ఉన్న ఆసక్తి కాస్త అంతమైపోయింది. ఐనా రైలు మాత్రం అతని జీవితంలో ముఖ్యప్రాత పోషిస్తూనే వుంది.

తండ్రి ఛాయలకు దూరంగా బొంబాయిలోని ఒక ఆర్ట్ స్కూల్‌లో చదువుకోడానికి సంజయ్‌కు అవకాశం లభించినా అతని కోరిక పూర్తిగా నెరవేరలేదు. తనకోసం రైల్వేలో టిక్కెట్ ఎక్జామినర్ ఉద్యోగం సంపాయించి అందులో చేరమని తండ్రి ఒక ఆంక్ష విధించే సరికి ఇష్టం లేకపోయినా మళ్ళా ఆ రైలే అతనికి శరణ్యం అయింది.

రైల్లో షాలిని అనే అమ్మాయితో పరిచయం అయ్యింది. ఇద్దరూ ఒకరికొకరు ఆకర్షితులయ్యారు. వాళ్ళ మధ్య ప్రేమ ప్రభావం బలీయమవుతున్నా సంజయ్ మనసులోని తండ్రి మాత్రం అతనిని భయకంపితుడ్ని చేయసాగాడు. షాలిని అతని బలహీనతను గ్రహించినప్పటికీ ఏమీ అనలేకపోయింది. పూనాలోని తన కుటుంబ సభ్యులకు ఒకసారి సంజయ్‌ను పరిచయం చేసేటప్పుడు అతడు అవివాహితుడని చెప్పడానికి ఆమెకు భయం వేసి తన ఆఫీసులోనే పనిచేస్తున్నాడని, పెళ్ళయిందనీ చెప్పింది. షాలిని తను ఒక్కతే ఉద్యోగం చేస్తూ కుటుంబసభ్యులందరినీ పోషించాలి. పైగా తమ వివాహానికి సంజయ్ తండ్రి అసమ్మతి తెలియజేస్తే ఆయనను ఎదిరించి సంజయ్ తనను స్వీకరిస్తాడన్న నమ్మకం ఆమెకు కలగలేదు.

కొన్నాళ్ళకు సంజయ్ వివాహాన్ని యమున అనే అమ్మాయితో నిశ్చయించాడు సంజయ్ తండ్రి. ఆ పెళ్ళి తనకిష్టం లేదని సంజయ్ ఎంత మొత్తుకున్నా ఆయన వినలేదు. యమున పల్లెటూరి పిల్ల. కట్నంగా తనతో తీసుకొచ్చిన గేదేలూ ఆమే ఒక్కలాగే కనిపించారు సంజయ్‌కి. ఆమెతో అతని జీవితం దుర్భరమే అయింది.

రైలుస్టేషన్‌లో ఒకసారి సంజయ్‌కి షాలిని తటస్థపడింది. అతనిలో అశాంతి చెలరేగింది. ఎక్కడైనా దూరంగా పారిపోదామన్న ఉద్దేశంతోనే ఈ రైలెక్కాడు.

అతని గతాన్ని, జ్ఞాపకం చేస్తూ, రైలు బెనారస్‌వరకూ వచ్చి ఆ స్టేషన్‌లో ఆగిపోయింది. ఆ రైలుకు అదే గమ్యస్థానం కావడంతో సంజయ్ దిగిపోక తప్పలేదు. కాశీలోని తీర్థయాత్రికులలో కలిసి ఎక్కడెక్కడో తిరిగాడు. అనుకోకుండా ఒక వేశ్య ఇంటికి తీసుకుపోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా అతని శూన్యమే వెంటాడసాగింది. జీవితంలో అనుకున్నవేవీ సాధించలేకపోతున్న తను చిట్టచివరికి ఒక ఖాళీ రైలు పెట్టెలో చనిపోయినట్లు నిద్రలో ఓ భయంకరమైన కల కనేసరికి అతనికేదో జ్ఞానోదయమయ్యింది. 'జీవితానికి భయపడి పారిపోకూడదు. దాన్ని ధైర్యంగా ఎదిరించాలి ' అన్న దృఢ నిశ్చయానికి వచ్చి తిరిగి ఇంటి ముఖం పట్టాడు. అక్కడ తన భార్యలోనూ, ఆ ఇంటి వాతావరణంలోనూ ఏ మార్పూ కనబడలేదు. ఆతృతగా షాలినిని చూద్దామని వెళ్ళాడు. అక్కడ ఆమె నిస్సహాయంగానే కనిపించేసరికి ఆమెను కలుసుకోవడానికి కూడా వెనుకాడాడు. పట్టాలమీద నడిచే రైలు (27 డౌన్) లాగే సంజయ్ కూడా యాంత్రికంగా జీవితాన్ని కొనసాగించక తప్పలేదు[1].

పురస్కారాలు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
1973 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం - హిందీ అవతార్ కృష్ణ కౌల్ విజేత
1973 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రాహకుడు (నలుపు తెలుపు) అపూర్బ కిశోర్ వీర్ విజేత

మూలాలు

  1. సంపాదకుడు (1 November 1974). "27 డౌన్". విజయచిత్ర. 9 (5): 57. |access-date= requires |url= (help)

బయటిలింకులు